నా డాన్స్ చాలా మెరుగుపడింది – తమన్నా

నా డాన్స్ చాలా మెరుగుపడింది – తమన్నా

Published on Dec 27, 2012 6:30 PM IST

Tamanna-in-rebel
దక్షిణాదిన డాన్స్ లో మంచి పేరు సంపాదించుకున్న నటీమణులలో తమన్నా ఒకరు. “హ్యాపీ డేస్” చిత్రం నుండి గ్లామర్ డాల్ గా ఉన్నా కూడా “బద్రీనాథ్” చిత్రంతో ఆమె తన డాన్స్ ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేసింది. “రచ్చ” మరియు “రెబల్” చిత్రంలో తన డాన్స్ తో చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపుగా ఒక ఏడాది తరువాత అజిత్ తో కలిసి ఒక తమిళ చిత్రంలో నటించబోతున్నారు. ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ “గత రెండేళ్లుగా నేను తెలుగు పరిశ్రమలో పని చేస్తున్నాను అందుకే తమిళ చిత్రాలలో ఎక్కువగా కనిపించలేకపోయాను. ఈ రెండేళ్లలో నా డాన్స్ చాలా మెరుగుపడింది. తెలుగు పరిశ్రమకి ఎంతో రుణ పది ఉంటాను ఈ విషయంలో ఇప్పుడు ఎంత కష్టమయిన స్టెప్ అయిన ఈజీ గ చెయ్యగలను” అని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ తెలుగులో “వెట్టై” చిత్ర రీమేక్ మరియు బాలివుడ్లో “హిమ్మత్ వాలా” చిత్రాలలో నటిస్తున్నారు.

తాజా వార్తలు