ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు గెలుస్తా

ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు గెలుస్తా

Published on Oct 16, 2012 11:35 AM IST


కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కూతురుగా లక్ష్మీ మంచుకి అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయి. మంచి విద్యావంతురాలు, మంచి లైఫ్ స్టైల్ మరియు పేరు ఇలా అన్నీ ఉన్నాయి. కానీ తనను తాను నిరూపించుకోవాలని కొంచెం కష్టతరంతో కూడుకున్న నటన మరియు ప్రొడక్షన్ విభాగాలను ఎంచుకున్నారు. అంతే కాకుండా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో లక్ష్మీ మంచు నటించిన ‘ఐరేంద్రి’ పాత్రకి నంది అవార్డు సొంతం చేసుకుంది. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ ఎవరి సలహా వల్లనో నేను ఈ కెరీర్ ఎంచుకోలేదు. నాకు ఇష్టమైందే నేను చేస్తాను. నాకు వివాహమైన తర్వాతనే నేను నటిగా తెరకు పరిచయమయ్యాను. నా విజయాని నా భర్తే కారణం అని’ ఆమె అన్నారు.

మీకు జీవితాశయం ఏమిటి? అని అడిగితే దానికి లక్ష్మీ మంచు ‘ఆస్కార్ అవార్డు గెలుచుకోవడమే’ అని అన్నారు.

ప్రస్తుతం లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో మరియు నిర్మాతగా ‘గుండెల్లో గోదారి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కాకుండా మణిరత్నం దర్శకత్వంలో రానున్న ‘కడలి’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించారు. లక్ష్మీ మంచు జీవితాశయం అయిన ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవాలని ఆశిద్దాం.

తాజా వార్తలు