వివాదంపై ఓపెన్ అయిన ముత్తయ్య.!

ఇప్పుడు కోలీవుడ్ లో పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. లెజెండరీ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం “800”. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి తమిళ ప్రజలు సేతుపతికి ఎదురు తిరిగారు. ఈ చిత్రం చెయ్యకూడదని పెద్ద ఎత్తున నినదించడంతో అసమ్మతి సెగ రాజుకుంది.

అలాగే ఈ విషయంలో విజయ్ సేతుపతికి సపోర్ట్ చెయ్యడానికి అక్కడ సీనియర్ నటులు కూడా ముందుకొచ్చారు. కానీ దీనిపై ఫైనల్ గా ముత్తయ్య కూడా ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఏ పరిస్థితుల్లో ఈ సినిమా మొదలయ్యిందో మురళీధరన్ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. తాను శ్రీలంకలో పుట్టిన తమిళవాడిని అని అక్కడ పుట్టడం నా తప్పా, చిన్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను అని యుద్ధ భూమిలో పుట్టిన నాకు ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాయనని చెప్పారు.

అలాగే అక్కడ నుంచి అలాంటి ప్రాంతంలో ఎలా మనుగడ సాగించి ఇంతవాడిని అయ్యాను అన్నది ఈ చిత్రంలో చూపిస్తారని కానీ ఈ చిత్రాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని 2009లో జరిగిన అనర్ధాన్ని తప్పుగా అర్ధం చేసుకొని చెప్పిన నాకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

యుద్ధం ముగిసిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా జీవనం గడపాలి అనుకుంటున్నానని అందరిలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికే ఈ సినిమాకు అంగీకంరించారని” ముత్తయ్య ఈ వివాదానికి ఒక ముగింపు ఇచ్చారు. ఇదిలా ఉండగా తమిళ సీనియర్ నటి రాధికా కూడా విజయ్ సేతుపతికి ఈ 800 చిత్రానికి సపోర్ట్ చేసారు.

Exit mobile version