ముని -3 రేపే ముహూర్తం

ముని -3 రేపే ముహూర్తం

Published on Dec 18, 2012 12:55 PM IST

Raghava-Lawrence
2007లో వచ్చిన ముని సినిమా గుర్తుంది కదా! లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని బాగానే భయపెట్టింది. ఎంత భయ పెడితే అంత సొమ్ము చేసుకోవచ్చు అనే సూత్రం ఫాలో అయిన లారెన్స్ ఆ తరువాత కొంత కాలం ఆగి ముని సినిమాకి సీక్వెల్ గా 2011లో కాంచన అనే సినిమాను రూపొందించాడు. ముని కంటే కాంచన సినిమాలో ఎక్కువ భయపెట్టి దానిని మించిన హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాల్లో లారెన్స్ డైరెక్షన్ తో పాటుగా హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ సినిమాలకి సీక్వెల్ గా ముని 3 సినిమా తీయబోతున్నాడు. ముని, కాంచన ఈ రెండు సినిమాలు తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేయగా ముని 3ని మాత్రం తెలుగులో తీయడం విశేషం. కాంచన సినిమాని తెలుగులో విడుదల చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముని 3 సినిమాని నిర్మించనున్నారు. ముని 3 పూజ కార్యక్రమాలతో రేపే షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి రెండు సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా లారెన్స్ భయపెడతాడేమో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు