నాగి రెడ్డి అవార్డు గెలుచుకున్న మిస్టర్ పర్ఫెక్ట్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత సంవత్సరం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ మనసులు గెలుచుకోవడంతో పాటుగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఈ సినిమా నాగి రెడ్డి అవార్డును గెలుచుకుంది. నాగి రెడ్డి మరెవరో కాదు తెలుగు సినిమా మొదలైన రోజుల్లో ‘విజయా’ అనే బ్యానర్ స్థాపించి ఆ బ్యానర్ పై ఎన్నో గౌరవప్రదమైన సినిమాలు రూపొందించారు. ఈ అవార్డును ఈ నెల 22న చిత్ర నిర్మాత దిల్ రాజుకి ఈ అవార్డుని ప్రధానం చేయబోతున్నారు. ఈ అవార్డుతో పాటుగా ఒక మెమెంటో లక్షన్నర నగదు ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీ పెద్దలు డాక్టర్ రామానాయుడు, డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు, డాక్టర్ సి. నారాయణ రెడ్డి. నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు.

Exit mobile version