నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ‘నూకయ్య’కే వస్తున్నాయి: మనోజ్


మంచు మనోజ్, కృతి ఖర్బంధ మరియు సనా ఖాన్ ముఖ్య పాత్రల్లో అని కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం మిస్టర్ నూకయ్య. ఈ చిత్రం ప్రపంచమంతటా నిన్న విడుదలవగా అన్ని ఏరియాల నుండి మంచి టాక్ సంపాదించుకోగా పాత్రికేయుల సమక్షంలో ఈ చిత్ర సక్సెస్ మీట్ ఈ రోజు ఏర్పాటు చేసారు. చిత్ర హీరో మనోజ్ మాట్లాడుతూ నా కెరీర్లో అత్యదికంగా ‘బిందాస్’ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ చిత్రం తరువాత మిస్టర్ నూకయ్య చిత్రానికి నా కెరీర్లోనే అత్యదిక ఓపెనింగ్స్ వస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ మరియు ఎడిటర్ నవీన్ వల్ల ఈ సినిమా అత్యున్నత స్థాయికి వెళ్ళింది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో నాతో పాటుగా ధైర్యం చేసి సనా ఖాన్, కృతి నటించారు. మరో హీరో రాజా మాట్లాడుతూ తను కూడా ఈ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందని, ఈ సినిమా చూసాక తను మనోజ్ కి ఫ్యాన్ గా మారిపోయానని అన్నాడు. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని దర్శకుడు అని కన్నెగంటి అన్నాడు.

Exit mobile version