దర్శకుడు అజయ్ భూపతి తన మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు గాని, రెండో సినిమా కోసం మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. రూమర్స్ అయితే లెక్కకి మించి వస్తున్నాయి గాని, ఇంతవరకు క్లారిటీనే ఏది రాలేదు. నిజానికి ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు. మొదట రామ్ తో ఆ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో అనుకున్నా సెట్ కాలేదు. ఇక రవితేజతో ఫిక్స్ అనుకున్నారు. అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత సమంత – నాగచైతన్య జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి, అదీ లేదని తేలిపోయింది.
ప్రస్తుతానికి శర్వానంద్ హీరో అలాగే మరో హీరో కోసం కూడా చూస్తున్నారు…సినిమా టైటిల్ మహా సముద్రం అని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత అధికారికంగా ఈ సినిమాని ప్రకటించబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదన్నా నిజం అవుతుందేమో చూడాలి. “ఆర్ఎక్స్ 100” లాంటి సెన్సేషనల్ హిట్ సాధించినా.. అజయ్ భూపతికి సినిమా కష్టాలు మాత్రం తప్పట్లేదు.