బిర్యానీ కోసం మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానం

బిర్యానీ కోసం మోషన్ క్యాప్చూర్ పరిజ్ఞానం

Published on Oct 3, 2013 2:23 AM IST

biryani

రజినికాంత్ నటిస్తున్న ‘కొచ్చాడయాన్’ సినిమా తరువాత మోషన్ క్యాప్చూర్ అన్న పరిజ్ఞానం చాలా సినిమాలలో వాడుతున్నారు. కొత్త టెక్నాలజీని నేర్చుకుని తన సినిమాలలో ఉపయోగించే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమా ‘బిర్యానీ’లో ఒక పోరాట సన్నివేశాన్ని పుదుచెరిలో కార్తి, నితిన్ సత్యల మధ్య ఈ పరిజ్ఞానాన్ని వాడే తీసారు. ఈ సినిమా అదే పేరుతొ తెలుగులోకి కూడా అనువాదం కానుంది. ఆడియో మరియు విడుదలతేదీలను త్వరలోనే ప్రకటిస్తారు ఈ సినిమాలో మొదటిసారిగా కార్తి సరసన హన్సిక నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు