మహానటి చిత్రంతో భారీగా ఇమేజ్ పెంచుకున్న కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బెస్ట్ ఛాయిస్ గా మారారు. కాగా ఆమె నటించిన పెంగ్విన్ మూవీ తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రం నేరుగా డిజిటల్ ఫార్మట్ లో విడుదల అవుతున్న సంగతి తెల్సిందే. ఫ్యాన్సీ ప్రైస్ చెల్లించి, అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర ఓ టి టి హక్కులు దక్కించుకుంది.
కాగా నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. దట్టమైన అడవిలో తప్పిపోయిన కొడుకు కోసం పడే తల్లి ఆవేదనే ఈ చిత్రం అని తెలుస్తుంది. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది. మొత్తంగా పెంగ్విన్ ఎమోషనల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా, ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించారు. ఈనెల 19నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.