‘మనసా మనసా’ అంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ !

‘మనసా మనసా’ అంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ !

Published on Mar 2, 2020 12:33 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ ఆడియో ఆల్బమ్ నుంచి మెద‌టి పాట‌ విడుద‌ల అయింది. ‘మనసా మనసా’ అంటూ సాగిన ఈ పాటను గోపిసుంద‌ర్ మ్యూజిక్ డైరెక్ష‌న్ లో సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఇటీవ‌ల సిద్ శ్రీరామ్ పాడిన ప్ర‌తి పాట మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ చైర్ కొట్టేస్తున్నాయి. ఇదే త‌ర‌హాలో ఈ ఫ‌స్ట్ సింగిల్ కూడా ఆడియెన్స్ విష్ లిస్ట్ లో నిలవడం ఖాయమ‌నే అనిపిస్తోంది.

ఇటీవ‌లే అఖిల్, పూజా హెగ్ధేల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్ ప‌రిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హగ్ధేలు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు ఇండ‌స్ట్రీకి వ‌రుస‌పెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతుండ‌టంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తాజా వార్తలు