ప్రస్తుతం మన దక్షిణాది నుంచి రానున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ భారీ చిత్రం షూట్ ఎట్టకేలకు పునః ప్రారంభం కావడంతో ఈ చిత్రం అభిమానులకు మరోసారి సరికొత్త ఉత్సాహం వచ్చినట్టైయింది.
ఇక దీనితో పాటుగా ఈ చిత్ర యూనిట్ కూడా చాన్నాళ్లకు ఒక అధికారిక అనౌన్స్మెంట్ చేసేసరికి ఒక్కసారిగా మరోసారి ఈ చిత్రం హాట్ టాపిక్ అయ్యింది. అందులో భాగంగా ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉందని తెలిపారు. దీనితో అదేమిటా అని మరింత ఆసక్తి నెలకొంది. ఇపుడు మొత్తానికి RRR యూనిట్ ఆ సర్ప్రైజ్ అండ్ సెన్సేషనల్ అప్డేట్ ను రివీల్ చేసారు.
ఊహించని విధంగా వీడియోతో వచ్చి షూట్ ను మళ్ళీ మొదలు పెట్టమని చెప్పడంతో పాటుగా చివరి 5 సెకండ్లలో తారక్, చరణ్ ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ స్టఫ్ ను రాజమౌళి సాలిడ్ గా ప్లాన్ చేసారు. గుర్రంపై చరణ్, బులెట్ పై తారక్ లు వస్తున్నట్టుగా చూపించిన విజువల్ మంచి హై ఇస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ కు కావాల్సిన అసలైన ఎమోషన్ ను కూడా ప్రకటించేసారు.
అప్పుడు రామరాజు కోసం భీం గిఫ్ట్ ఇస్తే ఈసారి భీం కోసం రామరాజు ఇవ్వనున్న గిఫ్ట్ ఇదే అక్టోబర్ లో 22వ తారీఖున రివీల్ చేస్తున్నట్టుగా ప్రకటించేసారు. ఇక ఈ డేట్ ను యంగ్ టైగర్ ఫ్యాన్స్ లాక్ చేసేసుకున్నారు. మరి ఈ టీజర్ ను జక్కన్న ఎలా ప్లాన్ చేసారో అదెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక అది వచ్చాక తారక్ ఫ్యాన్స్ దండయాత్ర మామూలుగా ఉండదని చెప్పాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి