“సీతమ్మ వాకిట్లో..” కి పెరిగిన థియేటర్స్

“సీతమ్మ వాకిట్లో..” కి పెరిగిన థియేటర్స్

Published on Jan 14, 2013 5:30 PM IST

SVSC1

అనుకున్నట్టుగానే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అన్ని ఎరియాల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని సెంటర్లలోనూ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పండుగ సీజన్ కాకవడంతో ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల ప్రతి టౌన్ లోనూ ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకి తిరుపతిలో ఈ రోజు ఈ సినిమాని 8 థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో కలెక్షన్స్ కొల్లగొడుతున్న ఈ సినిమా తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చింది. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములగా నటించిన ఈ సినిమాలో సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రల్లో కనిపించారు.

తాజా వార్తలు