మనీ కోసం ఐటెం సాంగ్స్ చేయనంటున్న లక్ష్మీ రాయ్

మనీ కోసం ఐటెం సాంగ్స్ చేయనంటున్న లక్ష్మీ రాయ్

Published on Aug 11, 2013 2:36 PM IST

Lakshmi-Rai pic

ఆన్ స్క్రీన్ హాట్ హాట్ గా కనిపించి కుర్రకారుకి హీట్ పుట్టించే హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ తాజాగా రవితేజ నటించిన ‘బలుపు’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. దాంతో ఈ భామకి ఐటెం సాంగ్ ఆఫర్స్ బాగానే వస్తున్నాయి కానీ ఈ భామ దేనినీ అంగీకరించడం లేదు. ఐటెం సాంగ్స్ పై తనకున్న అభిప్రాయాన్ని చెబుతూ ‘ కేవలం డబ్బు మాత్రమే నా లక్ష్యం కాదు. అందుకే బలుపు సినిమా తర్వాత నాకు వచ్చిన చాలా ఐటెం సాంగ్స్ ఆఫర్స్ ని తిరష్కరించాను. బలుపులో కూడా ఆ పాత్ర నన్ను నన్నుగా చూపిస్తుంది కాబట్టి చేసాను. నేను నా పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను మంచి మంచి పాత్రలు చేస్తే డబ్బు దానంతట అదే వస్తుందని’ చెప్పింది. లక్ష్మీ రాయ్ కి తమిళ్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ భామ తెలుగులో ‘రాణి రానెమ్మ’ సినిమాలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు