తమిళ్లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మోనాల్ గజ్జర్

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన’ సుడిగాడు’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన మోనాల్ గజ్జర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ భామ తమిళ నటుడు విక్రమ్ ప్రభు సరసన ‘ఇవన్ వెరమాదిరి’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం ‘ఎంగేయుం ఎప్పోదుం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శరవణన్ ఈ సినిమాకి డైరెక్టర్. తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై ప్రముఖ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శివాజీ గణేషన్ వారసుడిగా పరిచయమైన విక్రమ్ ప్రభు ఈ సంవత్సరం ‘కుమ్కీ’ సినిమాతో పరిచయమై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన హీరోగా వస్తున్న రెండవ సినిమా పై అంచనాలు ఉన్నాయి మరియు మోనాల్ గజ్జర్ కెరీర్ కి ఈ సినమా చాలా కీలకం కానుంది.

Exit mobile version