మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్, ఫ్యాన్స్ షాక్ ఇచ్చేలా?

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్, ఫ్యాన్స్ షాక్ ఇచ్చేలా?

Published on Jun 11, 2020 7:36 AM IST

బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హామీ ఇస్తున్నా.. ఆ సూచనలేమి కనబడం లేదు. మోక్షజ్ఞ ఇంకా మానసికంగా, శారీరకంగా సిద్ధం అయినట్లు కనిపించడం లేదు. ఆయన లేటెస్ట్ లుక్ నిరాశపరిచేదిగా ఉంది. యంగ్ హీరోలు సైతం సిక్స్ ప్యాక్ బాడీలో మెస్మరైజింగ్ లుక్ లో సినిమాలు చేస్తుండగా, మోక్షజ్ఞ శరీరంపై కనీస శ్రద్ధ చూపించడం లేదు. నిన్న బాలయ్య పుట్టినరోజు వేడుకలలో కనిపించిన మోక్షజ్ఞ షేప్ అవుట్ బాడీలో కనిపించారు.

మరి ఈ కుర్రాడు ఎప్పుడు తన శరీరాన్ని హీరోల అవసరానికి తగ్గట్టుగా మారుస్తారో అర్థం కావడం లేదు. మరో వైపు మోక్షజ్ఞ లాంఛింగ్ ఖాయమే… డైరెక్టర్స్ వీరే అంటూ ప్రచారం జరుగుతుంటే, మోక్షజ్ఞ లుక్ మాత్రం ఫ్యాన్స్ ని బాగా ఇబ్బందిపెట్టేస్తుంది. తండ్రి బాలయ్య, నందమూరి అభిమానుల కోరిక మేరకు మోక్షజ్ఞ హీరో అవతారం ఎప్పుడు ఎత్తుతాడో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు