విడుదల తేదీ : జూలై 18, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : అహాన్ పాండే, అనీత్ పడ్డా తదితరులు
దర్శకుడు : మోహిత్ సూరి
నిర్మాత : అక్షయ్ విధాని
సంగీతం : మిథూన్, సచేత్ పరంపర, రిషబ్ కాంత్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్స్లాన్ నిజామి
సినిమాటోగ్రఫీ : వికాస్ శివరామన్
ఎడిటింగ్ : దేవేంద్ర ముర్దేశ్వర్, రోహిత్ మక్వర్ల
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సైయారా’ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ప్రేమలో విఫలమైన వాణి బత్రా(అనీత్ పడ్డా) డిప్రెషన్‌లోకి వెళ్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ అవ్వాలని పరితపించే క్రిష్ కపూర్(అహాన్ పాండే) తన లక్ష్యం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటాడు. ఓ ఉద్యోగంలో చేరిన వాణి తనకు ఎంతో ఇష్టమైన రైటింగ్స్‌ను ఓ పుస్తకంలో రాసుకుంటుంది. కట్ చేస్తే.. క్రిష్ కపూర్‌కు వాణి ఓ పాటను రాసి ఇస్తుంది. ఈ క్రమంలో క్రిష్, వాణి ప్రేమలో పడతారు. ఓ ఘటన కారణంగా తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడు క్రిష్. ఈ క్రమంలో వాణికి ఓ జబ్బు ఉందని డాక్టర్లు వెల్లడిస్తారు. మరి వాణి కోసం క్రిష్ తనకు ఎంతో ప్యాషన్ అయిన మ్యూజిక్‌ను వదిలేస్తాడా..? వాణికి వచ్చిన జబ్బు ఏమిటి..? దాని కారణంగా వారిద్దరు విడిపోతారా..? చివరకు ఏం జరుగుతుంది..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
మోహిత్ సూరి సినిమా అనగానే అందులోని లవ్ మనకు గుర్తుకు వస్తుంది. ప్రేమను మరింత బలంగా, లోతుగా చూపెట్టడంలో మోహిత్ సూరి స్పెషల్. గతంలో ఆయన తెరకెక్కించిన ‘ఆషికీ 2’ తరహా లైన్‌లోనే ఈ కథను కూడా రాసుకున్నాడు. కానీ, దీనికి ఆయన వేరే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒకరు జీవితంలో గెలవాలని ప్రయత్నిస్తారు.. ఒకరు ప్రేమలో విఫలమై బాధపడుతుంటారు.. ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే అది ఎంత గాఢంగా ఉంటుందనేది మనకు ఈ సినిమాలో చూపెట్టారు.
ఇక రొమాంటిక్ చిత్రాలకు కావాల్సిన మెలో డ్రామా ఈ సినిమాలోనూ పుష్కలంగా ఉండేలా మేకర్స్ చూసుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునేలా సాంగ్స్ కూడా ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్‌ను కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. కథతో పాటు వచ్చే సాంగ్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటాయి.
ఇష్టమైన వారికి కష్టం వస్తే వారి వెంట నిలబడాలనే పాయింట్‌ను ఇద్దరి జీవితాల్లో చూపెట్టిన కోణం బాగుంది. అదే విధంగా తమకు ఇష్టమైన వారు ఎదుగుతుంటే, దాని కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు అనే పాయింట్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక హీరోహీరోయిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో వారి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి రొమాంటిక్ డ్రామాలకు కథలో బలం చాలా అవసరం. ఈ సినిమాలో అది మిస్ అయినట్లు కనిపిస్తుంది. కేవలం రొమాన్స్, ఎమోషన్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టలేం. ఈ చిత్ర కథను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. స్క్రీన్ ప్లే పై మేకర్స్ జాగ్రత్త వహించాల్సింది.
ఫస్ట్ హాఫ్‌లోని పలు సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి. చాలా స్లోగా సాగే పేస్ వారి సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండాఫ్‌లోనూ డ్రామా ఎక్కువైందనిపిస్తుంది. కొన్ని సీన్స్ ప్రేక్షకులకు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూశామనే భావన కలుగుతుంది.
సినిమాలో మిగతా పాత్రలను ఇంకా బలంగా చూపెట్టాల్సింది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రకు ఇంకాస్త ప్రాధాన్యత ఇస్తే బాగుండేది. సినిమాలోని కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకులను మెప్పించవు. బీజీఎం వర్క కూడా రీపీటెడ్‌గా ఉండటం ప్రేక్షకులను విసిగిస్తుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మోహిత్ సూరి తనదైన మార్క్ రొమాంటిక్ కథతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఈసారి ఆయన కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. కథలో బలం లేకపోవడంతో ఆయన అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. చాలా సీన్స్ చక్కగా చూపెట్టారు. సంగీతం ఈ సినిమాకు మేజర్ బలంగా నిలిచింది. ప్రేక్షకులు ప్రతి పాటను ఎంజాయ్ చేస్తారు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే ‘సైయారా’ చిత్రం మోహిత్ సూరి మార్క్‌తో తెరకెక్కినా ఏదో వెలితి ఉన్నట్లుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఈ సినిమాలో రొమాంటిక్ డ్రామా, సాంగ్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, పలు ల్యాగ్ సీన్స్, కథలో బలం లేకపోవడం వంటివి ఈ చిత్రానికి మైనస్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team