రజిని, షారుఖ్ ల పక్కన మోహన్ బాబు

రజిని, షారుఖ్ ల పక్కన మోహన్ బాబు

Published on Mar 8, 2014 11:40 AM IST

mohan-babu-rajinikanth
త్వరలో ఒక వేడుక తారలతో తళుక్కుమననుంది. అవును మనం మాట్లడుకోనుంది రజిని కాంత్ నటించిన కొచ్చాడయాన్ ఆడియో విడుదల వేడుక గురించి. నిన్న ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హాజరుకానున్నాడు అన్ని విషయం తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు తెలుగు సినిమా రంగంనుండి మోహన్ బాబు కూడా అతిధిగా వెళ్లనున్నాడు. రజినికి మోహన్ బాబు చాలా మంచి స్నేహితుడు అన్న విషయం మనకు తెలిసినదే. అందుకే అడిగిన వెంటనే మార్చ్ 9న చెన్నైలో జరగనున్న ఈ వేడుకకు వస్తానని హామీ ఇచ్చాడు. ఈ వేడుకలో శంకర్, కె బాలచందర్, ఏ.వి.ఎం సర్వనన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. కె.ఎస్ రవికుమార్ కధ, మాటలను అందించారు. సౌందర్య రజినికాంత్ దర్శకత్వం వహించింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు.

తాజా వార్తలు