‘రౌడీ’ గా కనిపించనున్న మోహన్ బాబు

Mohan-Babu1
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ‘రౌడీ’ సినిమాలో చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించినున్నాడు. డా. మోహన్ బాబు, విష్ణు తో కలిసి రామ్ గోపాల్ వర్మదర్శకత్వం వహిస్తున్న సినిమాకి ‘రౌడీ’ టైటిల్ కన్ఫమ్ అయ్యింది. ఈ సినిమాకు ముందుగా చాలా పేర్లు అనుకున్నారు. కానీ చివరిగా ఈ టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమా పవర్ ఫుల్ రాజకీయ నేపద్యంలో, ఎమోషనల్ సన్నివేశాలతో, హై వోల్టేజ్ తో తెరకెక్కించనున్నరని సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు సాలిడ్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ దాదాపు ముగిసింది. త్వరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది . ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ వుంటాం.

Exit mobile version