వర్మ మూవీ విషయంలో థ్రిల్ అయిన మోహన్ బాబు

వర్మ మూవీ విషయంలో థ్రిల్ అయిన మోహన్ బాబు

Published on Jan 21, 2014 8:10 PM IST

Mohan-Babu
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ డ్రామా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ మరియు రాయలసీమ ఫాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన చాలా భాగం షూటింగ్ పూర్తయ్యింది.

డా. మోహన్ బాబు ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. వర్మ ఈ సినిమాని పవర్ఫుల్ గా తీస్తున్నాడని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబందించిన వివరాలను, అలాగే సినిమా టైటిల్ ని ఇంకా తెలియజేయడంలేదు. ఈ సినిమాతో వర్మ తరిగి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడా? ఏమో వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు