రవీనా టండన్ తో స్టెప్పులేయనున్న మోహన్ బాబు

రవీనా టండన్ తో స్టెప్పులేయనున్న మోహన్ బాబు

Published on May 18, 2013 9:35 AM IST

raveena-tandon_mohan_babu

మోహన్ బాబు తన నూతన చిత్రం షూటింగ్ యూరోప్ లో మొదలుపెట్టాడు. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ మల్టీ స్టారర్ సినిమాను శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు, మంచు మనోజ్, హన్సిక,రవీనా టండన్,ప్రణిత సుభాష్, వరుణ్ సందేశ్ మరియు తనీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విష్ణు, మనోజ్ ఒక్కో పాటలో నటించగా ఇప్పుడు మోహన్ బాబు తరుణం వచ్చింది. వెన్నిస్ లో రవీనా టండన్ తో కలిసి మోహన్ బాబు స్టెప్పులువేస్తున్నాడు. రాజు సుందరం కొరియోగ్రాఫర్. దాదాపు దశాబ్ద కాలం తరువాత రవీనా టండన్ మళ్ళీ తెలుగులో నటిస్తుంది. ఆమె టాలీవుడ్లో చివరిగా ‘ఆకాశవీధిలో’ సినిమాలో నాగార్జున సరసన నటించింది. అంతకుముందు బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో కనిపించింది.
గత కొన్నేళ్ళుగా మోహన్ బాబు పలు చిత్రాలలో నటించినా, పోయిన మూడేళ్ళలో మొదటిసారిగా అతను ఒకపాటకు డాన్స్ చేస్తున్నాడు. 2009లో విడుదలైన ‘సలీమ్’ సినిమాలో అతను ఆఖరిసారిగా డాన్సు చేసాడు. ‘ఝుమ్మంది నాదం’ సినిమా తరువాత నటిస్తున్న ఆయనను తరువాత ‘జగద్గురు ఆది శంకరాచార్య ‘ లో నటిస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ సినిమాను యూరోప్ లో తీస్తూన్నారు. ఇది చాలా ఎంటర్టైనింగ్ రీతిలో సాగుతుందని బృందం నమ్మకంగా వుంది. ఈ సినిమాకు గోపీ మోహన్, కోన వెంకట్ మరియు బి.వి.ఎస్ రవి స్క్రిప్ట్ బాధ్యతలు చేపట్టారు. ఎం.ఎం కీరవాణి, బప్పి లహరి, అచ్చు మరియు బాబా సహెగల్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు విష్ణు మరియు మనోజ్ నిర్మాతలు.

తాజా వార్తలు