శ్రీమతి అన్నపూర్ణ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మోహన్ బాబు

శ్రీమతి అన్నపూర్ణ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మోహన్ బాబు

Published on Dec 28, 2011 3:12 PM IST

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ గారు ఈ రోజు స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఆవిడ గారి మృతి చెందారని తెలియగానే అవాక్కయ్యనని డాక్టర్ మోహన్ బాబు గారు అన్నారు. అక్కినేని కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలియజేసారు. నాగార్జున గారి కుటుంబంతో తనకి చాలా దగ్గరి సంబంధం ఉంది అని, అన్నపూర్ణ గారు చాలా మంచి మనిషి అని అన్నారు. అన్నపూర్ణ గారు తనని విలక్షణమైన నటుడు అని మెచ్చుకునే వారు అని ఆవిడ మరణం తనని కలచి వేసిందని మోహన్ బాబు గారు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు