ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే

ఫిబ్రవరి 16 న తరువాతి షెడ్యూల్ ని మొదలుపెట్టుకోనున్న సి.వా.సి.చే

Published on Feb 6, 2012 7:32 PM IST

శ్రీకాంత్ అడ్డాల బృందం మొత్తం ఈ నెల 16 నుండి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణ కోసం తమిళ నాడు కుట్లారం కి వెళ్లనున్నారు. ఈ షెడ్యూల్ పదిహేను రోజుల ఉంటుంది తరువాత ఈ బృందం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ బాబు , వెంకటేష్ , అంజలి , సమంత , జయసుధ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రీకరణ లో పాల్గొననున్నారు. ఈ చిత్రీకరణ లో పాల్గొనే ముందు బ్యాంకాక్ లో జరగబోయే థమ్సప్ యాడ్ చిత్రీకరణ మహేష్ బాబు పాల్గొననున్నారు. మహేష్ బాబు దాదాపుగా రెండు నెలల తరువాత చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు

తాజా వార్తలు