సారధి స్టూడియోలో వారధి షూటింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ ‘వారధి’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హైదరాబాదులోని సారధి స్టూడియోలో ఈ చిత్రానికి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాల్లో ప్రభాస్, కోట శ్రీనివాసరావు మరియు సుప్రీత్ (కాట్రాజ్) పాల్గొంటున్నారు. ప్రభాస్ కి జోడీగా అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆకుల శివ దర్శకుడు. ఆకుల శివ గతంలో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు రచయితగా పనిచేసారు.

Exit mobile version