తమ అభిమాన నటుడు ఎన్.టి.ఆర్. ని ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో చూడాలన్నది చాల మంది నందమూరి అభిమానుల కోరిక. అయితే ఇప్పుడు ఆ కోరిక తీరింది. అయితే సినిమా కి కాదు లెండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్.టి.ఆర్. తో ఒక యాడ్ తీసారు. నవరత్న కంపెనీ కి ఎన్.టి.ఆర్. బ్రాండ్ అంబాసిడర్. ఈ కంపెని యాడ్ నే త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించారు.
అయితే యాడ్ తీస్తున్న సమయం లో ఎన్.టి.ఆర్. మరియు త్రివిక్రమ్ బాగా కలిసిపోయారు అని వినికిడి. ఎన్.టి.ఆర్. కి అద్భుతమైన మాస్ ఇమేజ్ ఉంది. త్రివిక్రమ్ కి ఏమో చక్కటి క్లాస్ ఇమేజ్. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక చిత్రం వస్తే ఇక అద్భుతమే. అతి త్వరలో ఇది జరగాలని కోరుకుందాం.