దమ్ము మరియు సమరన్ చిత్రాలతో బిజీగా ఉన్న త్రిషా

త్రిషా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ చిత్రంలో మరియు విశాల్ సరసన ‘సమరన్’ చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు చిత్రాల్లో విశ్రాంతి లేకుండా బిజే బిజీగా నటిస్తుంది. ఇటీవల పొల్లాచ్చిలో దమ్ము చిత్ర షూటింగ్లో పాల్గొన్న ఆమె హైదరాబ్డుకి తిరిగివచ్చారు. మరో 20 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని త్రిషా స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. త్రిషాతో పాటుగా మరో హీరొయిన్ కార్తీక నాయర్ హీరొయిన్ గా నటిస్తుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన కొన్ని స్టిల్స్ ఇటీవల విడుదలవగా అభిమానుల్లో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version