విడుదలకు సిద్దమయిన “తొలిపాట”

“నచ్చావులే’ ఫేం మాధవీలత, కృష్ణవాసా జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలిపాట’. ఈ చిత్రానికి కే.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెలలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరాజు మాట్లాడుతూ -‘‘ప్రేమ, సెంటిమెంట్, కామెడీ సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది. ఒక దృశ్యకావ్యంలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరకు, వైజాగ్, భీమిలి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ చిత్రం పాటలు కనువిందుగా ఉంటాయి. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. రవళి, మనోరమ, జయలలిత, బాబూమోహన్, విజయచందర్ ఈ చిత్రం లో కనిపించనున్నారు ఈ చిత్రానికి కృష్ణవాసా సంగీతం అందించారు. .

Exit mobile version