అక్కినేని నాగార్జున తదుపరి చిత్రం ‘రాజన్న’ త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం చాలా సంతృప్తికరం గా వచ్చిందని చిత్ర నిర్మాణ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధం గా , ఈ చిత్రానికి ముగ్గురు హీరోలు అని కూడా చెబుతున్నారు. వారు ఎవరు అనుకుంటున్నారా? నాగార్జున, బేబీ ఎన్నీ మరియు కీరవాణి సంగీతం.
ఆదిలాబాద్ జిల్లలో జరిగే ఈ కథ, రజాకర్ల దౌర్జన్యాలకు ఎదురు తిరిగే ఒక వ్యక్తి కథ గా చెప్పుకోవచ్చు.
కీరవాణి సంగీతం ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది.ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక మైలు రాయి గా మిగిలిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారు. రాజన్న చిత్రాన్ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో రూపొందించారు. నాగార్జున స్వయం గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 23 న ఈ చిత్రం విడుదల కు సిద్ధం అవుతోంది.