ఎస్ ఎస్ తమన్ తను రాబోయే రెండు చిత్రాలకు సంగీతం సమకూర్చటానికి బ్రెజిల్ కి పయనమవటానికి సిద్దమయ్యారు ప్రస్తుతం తమన్ నిప్పు మరియు లవ్ ఫెయిల్యూర్ చిత్రాల రే- రికార్డింగ్ పనులలో ఉన్నారు. ఈ రెండు చిత్రాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం తమన్ రామ్ చరణ్ వి.వి.వినాయక్ చిత్రం మరియు ఎన్.టి.ఆర్ శ్రీను వైట్ల చిత్రాల సంగీతం కోసం బ్రెజిల్ వెళ్లనున్నారు. తమన్ రామ్ చరణ్ తో మొదటి సారి పని చేస్తుండగా ఎన్.టి.ఆర్ తో గతం లో బృందావనం చిత్రానికి పని చేశారు.