“బాద్షా” రికార్డింగ్ మొదలు పెట్టేసిన తమన్

“బాద్షా” రికార్డింగ్ మొదలు పెట్టేసిన తమన్

Published on Apr 16, 2012 8:56 PM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ చిత్రం “బాద్షా” ఈ మే నుండి చిత్రీకరణకు సిద్దమయ్యింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయన అప్పుడే పాటలు రికార్డింగ్ చెయ్యటం మొదలు పెట్టేశారు. టైటిల్ సాంగ్ మరియు ఇంకొక పాట కూడా రికార్డింగ్ పూర్తయ్యిందని తమన్ ట్వీట్ చేశాడు . కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యాబై రోజుల పాటు ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. హాస్యం మిళితం అయిన యాక్షన్ కథగా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రం కోసం ఎన్టీయార్ మరియు శ్రీను వైట్ల తొలిసారి కలిసి పని చేస్తున్నారు.

తాజా వార్తలు