తమన్నా తమిళ చిత్రం ఒప్పుకొని ఏడాది పైనే అయ్యింది. ఒకానొక సమయం లో తమిళ చిత్ర పరిశ్రమ లో “ఆయన్” మరియు “పైయ్య” చిత్ర విజయాలతో మంచి పేరు తెచుకున్నారు కాని తరువాత తెలుగు లో వరుస చిత్రాలు ఒప్పుకోవటంతో తమిళ చిత్రాలు చెయ్యటానికి కుదరలేదు. ఈ మధ్యనే ఈ భామను ఒక పెద్ద చిత్రం కోసం సంప్రదించినట్టు చెప్తున్నారు ఈ చిత్రం లో జీవ కథానాయకుడిగా నటిస్తుండగా అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ప్రధాన కథానాయికగా త్రిషని ఎంపిక చేసేసుకున్నారు రెండవ కథానాయిక కోసం తమన్నా ను సంప్రదించినట్టు ప్రచురించింది. ఈ వార్తను తమన్నా కొట్టిపారేసింది తనను ప్రధాన పాత్ర్హ కోసమే సంప్రదించారని రెండవ పాత్ర కోసం కాదని తేల్చి చెప్పేసింది. ఇంకా కొన్ని నెలల వరకు తమిళ చిత్రం చెయ్యలేను అని కూడా చెప్పింది ప్రస్తుతం ఈ భామ “రచ్చ”,”రెబల్” మరియు “ఎందుకంటే ప్రేమంట” చిత్రాలలో నటిస్తుంది.