రాంబాబుకి కెమెరామాన్ దొరికింది

ఎట్టకేలకు భారీ సస్పెన్స్ కి తెరపడింది. పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కలయిక లో వస్తున్న సినిమా ” కెమెరామాన్ గంగతో రాంబాబు” చిత్రంలో కథానాయిక ఎవరు అన్న సస్పెన్స్ కి ఈరోజు పూరి జగన్నాథ్ తెరదించారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నటించే కథానాయిక తమన్నా అని ఆయనే దృవీకరించారు. “గబ్బర్ సింగ్” చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత ఈ చిత్ర చిత్రీకరణ మొదలుకాబోతుంది . డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర అధికారిక ప్రారంభం ఈ మధ్యనే పూరి ఆఫీస్ లో జరిగింది. గతంలో వీరి కలయికలో వచ్చిన “బద్రి” భారీ విజయం సాదించడం ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.

Exit mobile version