ప్రాముఖ్యత ఉన్న పాత్రలో చేశా చిత్రం ఎలా ఉంటుందో చూడాలి – తమన్నా

మిల్క్ బ్యుటి తమన్నా తన రాబోతున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట” చిత్రంలో పాత్ర గురించి చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఈ భామ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 8న విడుదల కానుంది. ” ఈ చిత్రం కోసం పని చేయటం చాలా ఆనందంగా ఉంది ఇందులో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అని ఆసక్తికరంగా వేచి చూస్తున్నా” అని తమన్నా అన్నారు. ఈ మధ్యనే “రచ్చ” చిత్రంతో హిట్ కొట్టిన ఈ భామ ఈ చిత్రం తన కెరీర్ ని మరింత మెరుగు పరుస్తుందని అనుకుంటున్నారు. రామ్ హీరో గా నటించిన ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. జి.వి ప్రకాశ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version