షాడోతో ఆశ్చర్యపరచబోతున్న తాప్సి

షాడోతో ఆశ్చర్యపరచబోతున్న తాప్సి

Published on May 29, 2012 2:25 AM IST

తాప్సీ ఈ ఏడాది పెద్ద చిత్రాలతో బిజీగా ఉంటున్న కథానాయిక.తన కెరీర్ నడుస్తున్న విధానం మీద తాప్సీ ఆనందంగా ఉంది.కొద్ది వారాల క్రితం తన లుక్స్ తో ఆకట్టుకుంటానని తాప్సీ అభిమానులకి వాగ్దానం చేసింది. అలానే “దరువు” చిత్రంలో భారతీయ దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా తన రాబోతున్న చిత్రం “షాడో” లో అందరికి కన్నుల పండుగేనని అంటుంది. “ఇప్పుడే షాడో చిత్ర ఎడిట్ అయిన రెండు పాటల్లో భాగాలను చూశాను దరువు నుండి విభిన్నంగా కనిపిస్తున్నాను. ఈ చిత్రం లో నా వేషధారణ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది” అని తాప్సీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. “షాడో” చిత్రంలో తాప్సీ వెంకటేష్ సరసన నటిస్తుంది ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు మధురిమలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే స్విట్జర్లాండ్ లో చిత్రీకరణ జరుపుకుంది జూన్ మధ్యలో ఈ చిత్ర బృందం ముంబై వెళ్లనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు