వెంకటేష్ “షాడో” లో తాప్సీ?

వెంకటేష్ “షాడో” లో తాప్సీ?

Published on Jan 25, 2012 1:53 AM IST

వెంకటేష్ రాబోతున్న చిత్రం మెహర్ రమేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం జనవరి 25 న రామానాయుడు స్టూడియోస్ లో మొదలు కానుంది. ఈ చిత్రానికి “షాడో” అనే పేరుని పరిశీలిస్తున్నారు ఈ చిత్రం లో వెంకటేష్ సరసన రిచా గంగోపాధ్యాయ్ చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం తాప్సీ ని ఒక పాత్ర కోసం అడిగినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే వెంకటేష్ తో చెయ్యబోయే మొదటి చిత్రం అవుతుంది.తారాగణం గురించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. చిత్రం లో వెంకటేష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. గత సంవత్సరం “మొగుడు” చిత్ర పరాజయం తరువాత తాప్సీ ఈ ఏడాది మూడు చిత్రాలలో చేస్తుంది “చష్మీ బద్దూర్”,”గుండెల్లో గోదారి”,”దరువు” చిత్రాలలో నటిస్తుంది ఇప్పుడు ఈ చిత్రం కూడా ఈ లిస్టు లో చేరింది. ఈ సంవత్సరం తాప్సీ కి బాగా కలిసివస్తుందని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు