‘అంజాన్’ కోసం కొత్తగా మారిన సూర్య

surya

హీరో సూర్య నిలకడగా విజయాన్ని సాదిస్తూ ముందుకు సాగుతున్న నటుడు. సూర్య తన ప్రతి సినిమాలో పాత్రకి తగినట్టుగా తనని తను మార్చుకుంటూ ఉంటాడు. అలాగే ‘అంజాన్’ సినిమాకోసం కూడా సూర్య సరి కొత్తగా రెడీ అయ్యాడు. సూర్య ఈ సినిమా కోసం సూర్య మార్పుపై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది. సూర్య ఈ కొత్త అవతారంలో చాలా కూల్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగష్టు 2014న విడుదలయ్యే అవకాశం ఉంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ నటిస్తోంది. ఈ ‘అంజాన్’ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలవుతోంది. యుటీవీ కో – ప్రొడక్షన్ లో తిరుపతి బ్రదర్స్ నిర్మిస్తున్నారు.

Exit mobile version