సందీప్ కిషన్ మరో చిత్రం ఒప్పుకున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ బ్యానర్ మీద మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ టెంపుల్ లో ఈ చిత్రం ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ “గుండెల్లో గోదారి” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాప్సీ సరసన నటిస్తున్న ఈ నటుడు ఇది కాకుండా “రొటీన్ లవ్ స్టొరీ లో కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది. ఇది కాకుండా రాజ్ పిప్పళ్ళ దర్శకత్వం లో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కూడా ఈ నటుడు కనిపించబోతున్నారు.