గాలి చిత్రం గురించి మరిన్ని విషయాలు చెప్పిన సుధీర్ బాబు

రెండు రోజుల క్రితం సుధీర్ బాబు తన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “అగ్గి పుల్ల” తో పాటు సమాంతరంగా మరో చిత్రాన్ని చేయ్యనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి “గాలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు ఈ చిత్రం గురించి మాట్లాడేప్పుడు ఈయన చిన్న తప్పు చేశారు ఆయన ఈ చిత్రానికి “ఈరోజుల్లో” మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు అని ప్రకటించారు కాని ఈ చిత్రానికి కథ-కథనం-మాటలు మాత్రమే “ఈరోజుల్లో” మారుతీ అందిస్తున్నారు మారుతి స్నేహితుడయిన రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు “క్షమించాలి తప్పయిపోయింది “గాలి” చిత్రాన్ని మారుతీ మరియు కొంతమంది నిర్మిస్తున్నారు మారుతీ కథ-కథనం-మాటలు అందిస్తుండగా రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు” అని సుదీర్ బాబు ట్విట్టర్లో చెప్పారు. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాల త్వరలో వెల్లడిస్తారు

Exit mobile version