నటుడుగా మారిన శ్రీరామ చంద్ర

ఇండియన్ ఐడల్ విన్నర్ మరియు ప్రముఖ గాయకుడు అయిన శ్రీరామచంద్ర నటుడిగా పరిచయం అయ్యేందుకు సకలం సిద్దమయ్యింది. జే.కే భారవి తెరకెక్కిస్తున్న భక్తి రస చిత్రం “జగద్గురు ఆది శంకర” చిత్రంలో కామ్న జేత్మలాని సరసన రాజు అమరుఖ పాత్రలో శ్రీరామ చంద్ర కనిపించనున్నారు. ఈ మధ్య కాలం లో చాలామంది సంగీత దర్శకులు మరియు గాయకులు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు.ఈ చిత్రంలో శ్రీరామ చంద్ర పూర్తి నిడివి ఉన్న పాత్ర చేస్తున్నారు ఈ చిత్రంలో నాగార్జున మరియు మోహన్ బాబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కౌశిక్ ఈ చిత్రంలోఅది శంకరాచార్య పాత్రలో కనిపించనున్నారు. నాగ శ్రీవత్స్ ఈ చిత్రానికి సంగీతం అందించగా గ్లోబల్ పీస్ క్రియేటివ్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

Exit mobile version