బ్యాంకాక్ నుండి తిరిగి వచ్చిన శ్రద్ద దాస్

బ్యాంకాక్ నుండి తిరిగి వచ్చిన శ్రద్ద దాస్

Published on Dec 29, 2011 5:06 PM IST

“రేయ్” చిత్రం కోసం ఒక నెల షూటింగ్ పూర్తి చేసుకొని శ్రద్ద దాస్ తిరిగి వచ్చారు. ఇప్పటి వరకు తను చేసిన విదేశీ షెడ్యూల్ ల లో ఇదే పెద్దది. ఈ చిత్రం చిత్రీకరణ కు ముందు తను గాయపడింది తన కంటికి పెద్ద ప్రమాదం తప్పింది. షూటింగ్ సమయం లో హెవి లైట్ కట్టర్ తన మీద అకస్మాతుగా పడి గాయపడింది. శ్రద్ద దాస్ చివరగా “మొగుడు” చిత్రం లో కనిపించింది “రేయ్” చిత్రం లో పాత్ర తను చేసే ఉత్తమ పాత్ర అవుతుందని అన్నారు. ఈ చిత్రం లో “మెగాస్టార్” చిరంజీవి గారి అల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నారు , శుబ్రా అయ్యప ఈ చిత్రం లో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2012 వేసవి కాలం లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు