అమీ జాక్సన్ కోసం అదనపు మైలు వెళ్ళిన శంకర్

shankar
హీరోయిన్లను ఎంతో అందంగా అందులోనూ పాటల్లో మరింత అందంగా చిత్రీకరించే దర్శకులు అతి కొద్ది మంది మాత్రమే శంకర్ తో సరితూగుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం విక్రం, అమీ జాక్సన్ కలసి ‘ఐ’ చిత్రం కోసం శంకర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం ‘మనోహరడు’ పేరుతో తెలుగు విడుదల కానుంది.

చెన్నై నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ప్రసాద్ లాబ్స్ చెన్నై లో అమీ జాక్సన్ పై ఒక పాట ని చిత్రీకరించడం కోసం శంకర్ ఒక భారి సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ ఈ నెలలో జరగనుంది. అమీ జాక్సన్ ఒక మోడల్ పాత్ర పోషిస్తుండడం తో శంకర్ అమీ రోల్ ని ఒక అల్ట్రా స్టైలిష్ రీతిలో చూపించడానికి ఒక అద్బుతమైన కాన్సెప్ట్ ఉపయోగించనున్నాడని సమాచారం. గతంలో ‘ఎవడు’ లోని -ఒక పాటలో బికినీలో అమీ కనపడింది. ఇప్పుడు ఈ పాటని శంకర్ చిత్రీకరిస్తుండడంతో అమీ జాక్సన్ కెరీర్ లోనే గుర్తుండిపోయే పాట కానుంది.

ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి పి.సి. శ్రీరాం ఛాయాగ్రహణం అందించారు. ఆస్కార్ రవి చంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే ఆఖరి వారంలో కానీ జూన్ మొదట వారం లో కాని విడుదల కానుంది.

Exit mobile version