దబంగ్ 2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్

దబంగ్ 2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్

Published on Jan 27, 2012 6:45 PM IST

సౌత్ ఇండియాలో టాలెంట్ ఉన్న సినిమాటోగ్రాఫర్ లో సెంథిల్ కూడా ఒకరు. తెలుగులో హిట్ పలు సినిమాలకు పనిచేసిన సెంథిల్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ధబంగ్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెల్సిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న దబంగ్ 2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సెంథిల్ తెలుగులో ‘అరుంధతి’ మరియు ‘మగధీర’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసారు. సెంథిల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మరియు రాజమౌళి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ‘ఈగ’ చిత్రానికి పనిచేస్తున్నారు.

తాజా వార్తలు