హిందీలో పేలనున్న “సీమ టపాకాయ్”

హిందీలో పేలనున్న “సీమ టపాకాయ్”

Published on Mar 29, 2012 10:52 PM IST

విక్రమార్కుడు మరియ మగధీర వంటి చిత్రాల రీమేక్ ల తరువాత తాజాగా హిందీలో రీమేక్ కాబోతున్న చిత్రం అల్లరినరేష్ ప్రధాన పాత్రలో నటించిన “సీమ టపాకాయ్ ” రీమేక్ చెయ్యబోతున్నారు. జాకి భాగ్నాని అల్లరి నరేష్ పాత్రలో నటించబోతున్న ఈ చిత్రాన్ని పూజ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. గతంలో “ధూమ్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన “సంజయ్ గద్వి” దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్-వాజిద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో కథానాయిక ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదు. గత సంవత్సరం జాకి భాగ్నాని తండ్రి వాసు భాగ్నాని తెలు చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని అనుకున్నారు చివరికి అల్లరి నరేష్ “సీమ టపకాయ్” చిత్రాన్ని ఎంచుకున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు