సమంత ఆయుధాలు సరఫరా చెయ్యబోతుంది! ఆశ్చర్యపోకండి. మేము మాట్లాడుతుంది దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “ఈగ” గురించి ఇందులో సమంత శత్రువుల అంతు చూడటానికి ఈగ కి ఆయుధం సూది ని సరఫరా చేస్తుంది ఈ సూది తో ఈగ శత్రువులను మట్టుబెడుతుంది. సమంత ఈ చిత్రం లో పాత్ర గురించి చాలా ఆసక్తి గా ఉన్నారు ఈ చిత్రం మీద అన్ని చోట్ల నుండి భారి అంచనాలున్నాయి. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చ్ 22న ఈ చిత్ర ఆడియో విడుదల చెయ్యనున్నారు ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.