విక్రం,శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్న సమంత

విక్రం,శంకర్ చిత్రాన్ని ఒప్పుకున్న సమంత

Published on May 27, 2012 3:10 PM IST

శంకర్ రాబోతున్న చిత్రానికి సమంత సంతకం చేసినట్టు తెలుస్తుంది. విక్రం ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం రాజకీయ నేఫధ్యంలో వోటు కోసం డబ్బులు కాన్సెప్ట్ మీద నడుస్తుంది. తొలిసారి శంకర్ చిత్రంలో నటిస్తున్న సమంత తన కెరీర్ లో మరో మంచి చిత్రాన్ని దక్కించుకుంది.ఇలా తక్కువ సమయంలో గౌతం మీనన్,మణిరత్నం,శంకర్ మరియు రాజమౌళిల చిత్రాలలో నటించిన కథానాయిక సమంత మాత్రమే. ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పి సి శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది లోనే మొదలు కానుంది. సమంత త్వరలో ఈ వేసవికి అత్యంత వేచి చూస్తున్న చిత్రాలు రాజమౌళి “ఈగ” మరియు గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రంలోను కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు