తాజాగా వచ్చిన పుకార్ల ప్రకారం మణిరత్నం రాబోతున్న చిత్రం “పూక్కాడై” చిత్రం లో ప్రధాన పాత్ర కోసం సమంతా ను ఎంపిక చేసుకున్నారు. గతం లో అక్షర హాసన్ లేదా రాధ రెండో కూతురు తులసి నటిస్తున్నారు అని పుకార్లు వచ్చాయి.ప్రముఖ హీరో కార్తీక్ తనయుడు గౌతం ఈ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా రోజుల తరువాత మణిరత్నం మళ్ళి ప్రేమకథ ను ఎంచుకున్నారు ఈ విషయమే ఈ చిత్రం మీద అంచనాలు పెంచాయి.ఈ చిత్రం లో లక్ష్మి మంచు ఒక కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఖాళి లేక బిజీ గా ఉన్న సమంతా ఈ చిత్రం కోసం డేట్స్ ఎలా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున మొదలు కాబోతుంది. దక్షిణ తమిళ నాడు లో చిత్రీకరణ జరుపుకోనుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!