అరవింద్ కృష్ణ మరియు సుప్రియ శైలజా ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “రుషి”. ఈ చిత్రం ప్రత్యేక ప్రీమియర్ షో ఈ నెల 8వ తారీఖున ప్రసాద్స్ లో ప్రదర్శిస్తున్నారు. రాజు ముదిరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒక వైద్య విద్యార్ధి ఎదుర్కొనే సమస్య వాళ్ళ తను చేసే పోరాటం గురించి ఉండబోతుంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాన్ మరియు స్నిగ్ధ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ప్రీమియర్ని ఐమాక్స్ లో ప్రదర్శిస్తున్నారు. చిత్రం గురించి పరిశ్రమ లో సానుకూల వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర విజయం అరవంద్ కృష్ణ సినిజీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది.