ఆదిలాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న “రొటీన్ లవ్ స్టొరీ”

ఆదిలాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న “రొటీన్ లవ్ స్టొరీ”

Published on Dec 28, 2011 7:52 PM IST

సుదీప్ కిషన్ మరియు రెగిన ప్రధాన పాత్రలలో వస్తున్న “రొటీన్ లవ్ స్టొరీ “ చిత్రం రెండవ షెడ్యూల్ కోసం ఆదిలాబాద్ అడవుల్లో ఈరోజు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గతం లో ఎల్ బి డబ్ల్వ్యు చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గతం లో హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంది తరువాత ప్రవీణ్ సత్తారు కర్నాటక లో కొన్ని ప్రదేశాలని పరిశీలించిన తరువాత పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక్కడ చిత్రీకరణ తరువాత ఈ చిత్రం రిషికేశ్ లో చిత్రీకరణ జరుపుకోనుంది ఈ చిత్రానికి మిక్కి.జే.మేయర్ సంగీతం అందిస్తుండగా సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు