రజినీకాంత్ పాటని వాడుకున్న వర్మ

రజినీకాంత్ పాటని వాడుకున్న వర్మ

Published on Apr 19, 2012 3:41 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ పాట ని రామ్ గోపాల్ వర్మ వాడుకున్నాడు. ఇదేమిటి అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మ తీసిన ‘డిపార్ట్మెంట్’ చిత్రం లో ‘ధన్ ధన్ ధన’ అనే ఒక ఐటెం సంగ్ ఉంది. ఈ పాటకి మూలం చాలా సంవత్సరాల క్రితం రజినీకాంత్ నటించిన ‘ఆశై నూరు’ అనే ప్రఖ్యాత తమిళ పాట. ఈ విషయాన్నీ వర్మ కూడా ధ్రువీకరించాడు. “అవును. ఆ పాట ని మూలం గా వాడుకున్నం. నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం, కనుకనే ఆ పాట కు నీరాజనం గా ఈ పాట ను తీసాను”, అంటున్నారు వర్మ.

డిపార్ట్మెంట్ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం అమితాభ్ బచ్చన్ , సంజయ్ దత్, రానా దగ్గుబాటి తదితరులు ఉన్నారు. ఈ చిత్రం వేసవి లో విడుదలకు సిద్ధం అవుతోంది.

తాజా వార్తలు