రామ్ గోపాల్ వర్మ “రెండో డిపార్ట్ మెంట్”

రామ్ గోపాల్ వర్మ “రెండో డిపార్ట్ మెంట్”

Published on May 27, 2012 1:08 PM IST

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం “డిపార్టుమెంటు” హిందీలో భారీ పరజాయం చవిచూశాక తెలుగులో ఈ చిత్ర విడుదల మీద అనుమానాలు మొదలయ్యాయి. హిందీలో ఈ చిత్రం విడుదల కాకముందు తెలుగు లో ఈ చిత్రాన్ని విడుదల చేయ్యనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. రానా,లక్ష్మి మంచు మరియు మధు శాలిని ఉండటం మూలాన ఈ చిత్రాన్ని ప్రాంతీయ చిత్రం లాగ ఆదరిస్తారని వర్మ అనుకున్నారు. ప్రస్తుతం వర్మ ఈ చిత్రానికి “రెండో డిపార్ట్ మెంట్” అన్న పేరుతో విడుదల చెయ్యనున్నారు. “డిపార్ట్ మెంట్ అసలు వెర్షన్ త్వరలో తెలుగులో “రెండో డిపార్ట్ మెంట్” అనే పేరుతో విడుదల చేస్తున్నాం. ఇందులో వేరే సీన్లు చాలా ఉంటాయి” అని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ఈ చిత్రం విడుదల తరువాత ఆ నటుడు వలెనే చిత్రం పరాజయం చవి చూసిందని రామ్ గోపాల్ వర్మకి మరియు సంజయ్ దత్ కి గొడవ మొదలయ్యింది ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ఎలా ఆదరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు