జూ.ఎన్టీయార్ ని పొగిడిన రవితేజ

జూ.ఎన్టీయార్ ని పొగిడిన రవితేజ

Published on Jan 26, 2012 10:03 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక కథానాయకుడు మరో కథానాయకుడిని పొగడడం చాలా అరుదు. ఈ మధ్య రవితేజ టివి9కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాస్ మహా రాజ రవితేజ జూనియర్ ఎన్టీయార్ పొగిడారు. మాములుగా ఇలా ఏదయినా జరిగితే ప్రజలు అభిమానులు చాలా సంతోషిస్తారు రవి తేజ జూనియర్ ఎన్టీయార్ గురించి మాట్లాడతూ ” ఎన్టీయార్ డైలాగు చెప్పే విధానం అద్బుతం. ప్రస్తుతం ఉన్న కథానాయకులలో పౌరాణిక మరియు చారిత్రిక పాత్ర్హలు పోషించగల ఒకే ఒక కథానాయకుడు ఎన్టీయార్ చాలా కష్టమయిన పదాలను పలికించగల సమర్ధుడు” అని చెప్పారు. ఈ విషయం ఎన్టీయార్ అభిమానులకి చాలా సంతోషం కలిగించాయి. త్వరలో రవితేజ “నిప్పు” చిత్రం తో ప్రజల ముందుకు రాబోతుండగా ఎన్టీయార్ “దమ్ము” చిత్రీకరణ లో పాల్గొంటున్నారు.

తాజా వార్తలు